వివాహ వేడుకలో చిరుతపులి హల్చల్ (వీడియో)

77చూసినవారు
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో చిరుతపులి ప్రత్యక్షమైంది. పెళ్లికి వచ్చిన వారంతా చిరుతను చూసి హడలిపోయారు. చిరుత భయంతో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు 4 గంటలకు పైగా కారులోనే ఉండిపోయారు. దాన్ని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బందిపై కూడా దాడి చేయాలని చూసింది. చివరకు అధికారులు శ్రమించి చిరుతను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్