సీఎం రేవంత్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో వంద కొడతామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి నుంచి మా నినాదం వంద కొడదాం.. బీఆర్‌ఎస్‌ను బొంద పెడదాం అని చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేటీఆర్, కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడితే ఫామ్‌హౌస్, గెస్ట్‌హౌస్‌లకు పరిమితమైన మీకు మా సీఎంతో పోటీనా? అని ఎద్దేవా చేశారు.