కొంత కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'జీవితం అనూహ్యమైంది. కొన్ని సంఘటనలు ఒక క్షణాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని గుర్తు చేస్తాయి. మనకు ప్రియమైన వారికి దగ్గరగా ఉందాం. వీలైన చోటల్లా సానుకూలతను వ్యాప్తి చేద్దాం' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో మనోజ్‌ను దగ్గరికి తీసుకుంటున్నట్లు విష్ణు హింట్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.