లైబీరియా జెండా కలిగిన కంటైనర్ నౌక కొచ్చి నుంచి 38 మైళ్ళ దూరంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో నౌకలోని 24 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ను నౌక యాజమాన్యం అత్యవసర సహాయం కోరింది. ఈ మేరకు 9 మంది సిబ్బంది లైఫ్ రాఫ్ట్ లలో సురక్షితంగా ఉండగా.. మిగిలిన 15 మంది ఆచూకీ కోసం రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి పరిస్థితిని ఇండియన్ కోస్ట్ గార్డ్ నిశితంగా పర్యవేక్షిస్తోంది.