ఢిల్లీలో ఉంటే ఆయువు తగ్గినట్టే: నితిన్ గడ్కరీ

61చూసినవారు
ఢిల్లీలో ఉంటే ఆయువు తగ్గినట్టే: నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో మూడు రోజులు ఉంటే చాలు.. కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి’ అని అన్నారు. ఈ కాలుష్యం జీవన కాలాన్ని 10 ఏళ్ల వరకు తగ్గించవచ్చని తెలిపారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై రెండూ కాలుష్యానికి ‘రెడ్ జోన్’గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్