AP: చేయి విరిగిందని చికిత్సకు వచ్చిన ఓ వివాహిత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విశాఖ జిల్లా తగరపువలసలోని జీరుపేటలో ఉంటున్న ఎర్రంశెట్టి రేవతి(22) ఈనెల 6న బాత్‌రూంలో జారిపడటంతో చేయి విరిగింది. సంగివలస ఎన్నారై ఆస్పత్రిలో చేరింది. 9న ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. ఆమెకు ఇచ్చిన మత్తు డోసు ఎక్కువై కోమాలోకి వెళ్లింది. వేరొక ఆస్పత్రికి తరలిచారు. పరిస్థితి విషమించి బుధవారం చనిపోయింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.