అమెరికా వీసా మోసాలు, అక్రమ వలసలను అరికట్టేందుకు విభిన్న విభాగాలతో సమన్వయం సాధిస్తూ ఒక ప్రత్యేక చర్యను ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిని జీవితాంతం అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించనుంది. అక్రమ వలసలను ప్రోత్సహించే వ్యక్తులు, విదేశీ ప్రభుత్వాలపై కొత్త వీసా పరిమితుల విధానాలను అమల్లోకి తీసుకురావాలని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం(@USAndIndia) ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.