ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి తెలంగాణా ఆర్టీసీ లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ సదుపాయాన్ని కల్పించింది. గద్వాల డిపోకు చెందిన బస్సులో జనవరి 2న రాయచూరు నుంచి ప్రయాణిస్తున్న మహిళ బస్సులోనే ప్రసవించింది. అయితే ఇటీవల ప్రభుత్వం బస్సు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత ప్రయాణం ఇవ్వాలంటూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా బస్ పాస్‌ను మంజూరు చేశారు.