తెలంగాణలో బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది. రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయని వెల్లడించింది.