అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఓ మెరుపు ఫోటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిని ‘స్పైట్’గా పిలుస్తారని నిపుణులు తెలిపారు. ఇది సాధారణ మెరుపులతో పోలిస్తే జెల్లీ ఫిష్ ఆకారంలో కనిపించే ప్రత్యేక ప్రకంపనలుగా ఉంటుందని వివరించారు. వ్యోమగామి నికోల్ ‘మెక్సికో, అమెరికా మీదుగా ప్రయాణిస్తూ ఈ అద్భుత దృశ్యాన్ని క్లిక్ చేశాను’ అంటూ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వేగంగా వైరల్ అవుతోంది.