మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగంగా కూడలి వద్ద ఒక స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా వైద్యురాలు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు