ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు హైవేపై వెళ్తున్న టెంపోను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. అనంతరం కారు డ్రైవర్ ఆగకుండా పారిపోయాడు. ఈ ఘటనలో టెంపోలో ఉన్న వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.