ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో హర్యానాకు చెందిన 24 ఏళ్ల లా విద్యార్థి రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్ర మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.