ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాదాబాద్ రోడ్డుపై ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. లారీ భారీ లోడుతో ఉండటంతో ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నా, అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.