దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగుచూసింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు. రద్దీ ప్రదేశమైన మధువిహార్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో ఒక్క సారిగా గోడ కూలిపోయి శిథిలాలు ప్రజలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.