వృద్ధురాలికి లోన్ యాప్ వేధింపులు

74చూసినవారు
వృద్ధురాలికి లోన్ యాప్ వేధింపులు
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలి ఇంటి ముందు ఉండే మహిళ లోన్‌యాప్‌ ద్వారా లోన్ తీసుకుంది. వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసింది. మహిళ జాడ తెలియక లోన్‌యాప్‌ నిర్వాహకులు ఆమె ఫోన్లోని కాంటాక్టు లిస్టులో ఉన్న వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు. రుణం కట్టించండి.. లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమేకాదు అసభ్యంగా మాట్లాడారు. ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదు.

సంబంధిత పోస్ట్