ఇల్లు నిర్మించుకోవడానికి రూ.18 లక్షల వరకు రుణం

59చూసినవారు
ఇల్లు నిర్మించుకోవడానికి రూ.18 లక్షల వరకు రుణం
సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మీరు గృహ నిర్మాణ సబ్సిడీని పొందవచ్చు. దీని కోసం సబ్సిడీ మొత్తాన్ని పెంచే యోచనలో ప్రధాని ఉన్నట్లు సమాచారం. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా రూ.18 లక్షల వరకు రుణం పొందొచ్చు. 3 శాతం వార్షిక వడ్డీ రాయితీ ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.18 లక్షల రుణం పొందితే రూ.2.20 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్