రైతు రుణమాఫీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పథకానికి అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోతే చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రుణమాఫీ వల్ల తమ జన్మ ధన్యమైందని స్వాతంత్య్ర వేడుకల్లో వ్యాఖ్యానించారు.