TG: బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రాష్ట్ర ముఖ్యనేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్లు సమాచారం. శుక్రవారం ఆయనతో సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం టికెట్‌లు కేటాయించే విధానం తెచ్చి.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరినట్లు సమచారం.