ఏపీలోని కూటమి సర్కార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను ప్రత్సాహించేందుకు ‘షైనింగ్ స్టార్స్-2025’ అవార్డులను ప్రదానం చేయనుంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన 52 మందిని మంగళవారం విద్యా శాఖ మంత్రి లోకేశ్ సన్మానించనున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ప్రభుత్వ జూ. కాలేజ్‌ల నుంచి 29 మంది, KGBV, APRJC నుంచి ఏడుగురు ఉన్నారు.