లారీకి మంటలు.. డ్రైవర్ సజీవదహనం (వీడియో)

68చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాజిపల్లి గ్రామంలో కంకరను అన్లోడ్ చేస్తుండగా లారీకి విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధం అయింది. అలాగే లారీలో ఉన్న డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన సృజన్‌గా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్