లారీ బీభత్సం.. పలువురికి గాయాలు.. వీడియో

85చూసినవారు
ఉత్తరాఖండ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్ సమీపంలోని మునికిరేటి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడబ్ల్యుడి కూడలి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఓ లారీ రోడ్డుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను దాటుకొని బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో పలువురుకి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్