TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి బైకర్ పైకి దూసుకెళ్లింది. అయితే ఈ క్రమంలో బైకర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వినాయకపురంలో ఈ నెల 6న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరని నెటిజన్లు అంటున్నారు.