బొప్పాయి ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకుల రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, షుగర్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే అసిటోజెనిన్‌లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.