బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ.. బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా?: కేటీఆర్

60చూసినవారు
బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ.. బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా?: కేటీఆర్
తెలంగాణ CM రేవంత్ రెడ్డికి పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ.. బడిపిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదని మాజీ మంత్రి KTR అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంలో ఉన్న ప్రేమ.. భవిష్యత్ భారతావని వారసులైన పసిపిల్లల ఆకలి కేకలపై లేదని మండిపడ్డారు. మీ ఢిల్లీ బాసులు.. మీ గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదు రేవంత్.. ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టు అని KTR సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్