AP: నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మర్రిపల్లి గ్రామానికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు ప్రాంతానికి చెందిన నాగ సాయి అనే యువకుడు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గురువారం శివప్రియ ఉరేసుకుని చనిపోయింది. తన కూతురిని కొట్టి చంపి ఉరివేసారని శివప్రియ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.