‘లబ్బర్ పందు’ మూవీ హీరోయిన్ స్వాసిక విజయ్ మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్‌తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు.