దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీపై వెంకీ స్పందిస్తూ.. దీనికి సీక్వెల్ తీస్తానని వెల్లడించారు. కానీ ఎప్పుడు చేస్తారనేది మాత్రం తెలుపలేదు. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది.