లూపస్ వ్యాధి సోకిన వెంటనే లక్షణాలు బయటపడవు. లక్షణాలు బయటపడడానికి కనీసం 3 ఏళ్ల సమయం పడుతుంది. నీరసంగా అనిపించడం, జ్వరం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తారు. ఇన్ఫెక్షన్ బారిన పడ్డామని అనుకుంటారు. కానీ లూపస్ చేయాల్సిన పని శరీరం లోపల చేస్తూనే ఉంటుంది. ఈ వ్యాధి ఉందని తెలిసే సరికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకే ఇది ప్రాణాంతక వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు.