లూపస్ అనేది శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది ఒకే భాగానికి పరిమితం కాదు.. శరీరంలోని అన్ని అవయవాల పైనా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. లూపస్ సోకిన వారి ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి తోడేలు ముఖంపై వచ్చిన మరకల్లా ఉంటాయి. అందుకే ఈ వ్యాధికి లూపస్ అని పేరు పెట్టారు. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలు అని అర్థం.