దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లగ్జరీ కారే అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కాగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.