యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇవాళ మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్‌రాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.మాఘపౌర్ణమి వేళ 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.