మహా కుంభమేళా.. 27 కోట్ల మంది పుణ్యస్నానాలు (వీడియో)

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 27 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 9-10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారని అధికారులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్