సనాతన ఆధ్యాత్మిక అతిపెద్ద పండుగ మహా కుంభమేళా. 144 ఏళ్లకు వచ్చే ఈ పండుగ ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయానికి ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో 45కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం పవిత్రమైన మాఘ పౌర్ణమి కావడం, శివరాత్రి వరకు సమయం ఉండటంతో ఈ సంఖ్య సునాయాసంగా 50 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత రద్దీని బట్టి ఈ సరికొత్త రికార్డు సాదిస్తుందని అంచనా వేస్తున్నారు.