అచ్చంపేట: పౌల్ట్రీ షెడ్ ను పరిశీలించిన కలెక్టర్

70చూసినవారు
అచ్చంపేట: పౌల్ట్రీ షెడ్ ను పరిశీలించిన కలెక్టర్
అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో ఎంజిఎన్ఆర్ఈజీ పథకంలో చేపడుతున్న పౌల్ట్రీ షెడ్ ను గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోశ్ పరిశీలించారు. గ్రామంలోని రైతు యాట పర్వతాలు పొలంలో 1000 కోళ్లకు సరిపడా పౌల్ట్రీషెడ్ ను నిర్మించారు. కలెక్టర్ పరిశీలించి రైతును అడిగి తెలుసుకున్నారు. డీఆర్డిఓ ఓబులేష్, ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ రఘుమూర్తి, ఈసీ కృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్