పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

65చూసినవారు
పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని కన్య తండా గ్రామంలో గురువారం మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు కేతావత్ చందర్ నాయక్, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్