నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన వీరయ్య (55) చిన్న కొడుకు పరమేశ్, అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెల రోజుల క్రితం ఆమెను ఏపీకి తీసుకెళ్లి సహ జీవనం చేశాడు. ఆచూకీ తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని కొట్టి.. మహిళను తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న మహిళ బంధువులు మంగళవారం వీరయ్యను కారుతో ఢీకొట్టి కళ్లల్లో కారం చల్లి, గొడ్డలితో దాడి చేసి చంపారు.