ఉప్పునుంతల మండలం జప్తి సదగోడు గ్రామానికి చెందిన అంజలి, నాగరాజులకు ఇద్దరు కూతుర్లు. శుక్రవారం భోజనం చేసి తల్లితండ్రులు ఇద్దరు కూతుర్లతో పడుకున్నారు. శనివారం ఉదయం లేచి చూడగా చిన్న కూతురు శ్రీ దివ్య(8) చలనం లేకుండా పడి ఉంది. అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.