జూలేకల్ గ్రామంలో కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి

77చూసినవారు
జూలేకల్ గ్రామంలో కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో కుక్కల దాడిలో దాదాపు 60 గొర్రె పిల్లలు చనిపోయిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ దాడికి కారణం ఆర్ డి ఎస్ కాలువ దగ్గర ఉన్న ఉత్తర ఫుడ్స్ కంపెనీ వారు చనిపోయిన కోళ్లు బయటపడేయడం వల్ల కుక్కలు మృత్యుగంధానికి అలవాటు పడి గొర్రె పిల్లలను చంపి తిన్నాయి అని బాధిత రైతు తెలిపాడు. రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్