అష్టాదశ పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. ఈ క్రమంలో అలంపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు ఆయనకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, అలంపూర్ పట్టణ యూత్ అధ్యక్షుడు డి నరసింహ, ఎల్లన్న, తదితరులు పాల్గొన్నారు.