సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే

69చూసినవారు
ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అయిజ, మనోపాడు, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, ఉండవెల్లి, అలంపూర్ మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 19 లక్షల 76, 500 విలువైన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్