జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో తుపత్రాళ్ళ 6వ వార్డులో నేటి ఉదయం 6: 00 గం" లకు మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని పలు సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, నల్లా కనెక్షన్లు, శానిటేషన్, తదితర సంబంధిత సమస్యలను అప్పటికప్పుడు సిబ్బందికి సూచించి పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు విజయ్, తదితరులు పాల్గొన్నారు.