అయిజ మండలం బింగిదొడ్డి యూపీఎస్ పాఠశాలపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఫ్యాన్లు, కిటికీలు, లైట్లు ధ్వంసం చేసి, పుస్తకాలు తగలబెట్టారు. ఈ ఘటనపై హెచ్ఎం రామేశ్వర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ పాఠశాలను సందర్శించి, దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్వీ నాయకుడు మత్తళి కోరారు.