మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ ను అప్రోచ్ రోడ్డులో గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సందర్శించారు. డంపింగ్ యార్డ్ మీదుగా భూత్పూరు - చించోలి జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో తవ్వకాలు జరిపారు. దాంతో డంపింగ్ యార్డ్ కు వెళ్లేందుకు వాహనాలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కలెక్టర్ పరిశీలించారు.