దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరకద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సురక్ష పోలీసు కళాబృందం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు, మొబైల్ ఫోన్ల వాడకంపై పాటలతో విద్యార్థుల వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఊర్మిళాదేవి, అధ్యాపకులు, ఎస్ఐ నాగన్న, కానిస్టేబుల్ రాము, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.