పాలమూరు ఉమ్మడి జిల్లాలో వర్షపాతం వివరాలు

66చూసినవారు
గడచిన 24గంటలల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలలో మంగళవారం భారీగా వర్షం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో అత్యధికంగా 75. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కిష్టంపల్లిలో 71. 3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 60. 8 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో 60. 8, నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో 39. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్