మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల భారతీయ జనతా పార్టీ కమిటీ సభ్యుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నూతన కమిటీ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను బీజేపీ నాయకులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.