కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు.