మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాలలో భక్తులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో నిత్యం లక్షలాది మంది దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తుంటారని మహిళలకు ముఖ్యంగా స్నానాలు చేయడానికి, వస్త్రాలు మార్చుకోవడానికి ఏర్పాట్లు సరిగ్గా లేవన్న భక్తులు విమర్శిస్తున్నారు. మరుగుదొడ్లు లేక ఆలయ పరిసరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.