దేవరకద్ర నియోజకవర్గం బలుసుపల్లిలో శుక్రవారం చదువుల తల్లి సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బలుసుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట చంద్రమౌళి, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ విజయ్ కుమార్, స్కూల్ టీచర్ స్రవంతి, అంగన్వాడీ టీచర్స్, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.